ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్ష‌య వ్యాధిపై విసృతమైన అవ‌గాహాన, ప్రచారం అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 04:29 PM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో క్ష‌య వ్యాధిపై విసృతమైన అవ‌గాహాన, ప్రచారం అవ‌స‌రం ఎంతైనా ఉందని, ప్ర‌జ‌ల్లో వ‌చ్చే మార్పు వ‌ల్లే దీన్ని అరికట్టగలమని, చికిత్స మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.


గురువారం హడావిడిగా తాడేపల్లి ప్రయాణమవుతూ, తన కార్యాలయంకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకొన్నారు.


తొలుత కృష్ణాజిల్లా క్షయవ్యాధి నివారణ సంస్థకు సంబంధించి మచిలీపట్నం టీ బి యూనిట్ సిబ్బంది మంత్రి పేర్ని నానిని కలిశారు. మార్చి 24 వ తేదీ ( నేడు ) ' వరల్డ్ టీబి డే ' అని ఈ సందర్భంగా క్షయ వ్యాధి నిర్మూలనపై గురువారం మచిలీపట్నం ప్రధాన వీధులలో ఆరోగ్య కార్యకర్తలు , నర్సింగ్ విద్యార్థినీలతో ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు. ఆ ర్యాలీకి సంబంధించిన బ్యానర్ మంత్రి చేత ఆవిష్కరింపచేశారు. జిల్లావ్యాప్తంగా 21 టీ బి యూనిట్ల పరిధిలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారిణి డాక్టర్ జి. జి. జె. నాగలక్ష్మి తెలిపారు.


అనంతరం టీ బి హెల్త్ విజిటర్ కె. వి. ఎన్. సుధాకర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపెర్వైజర్ విజయ గౌరీ , పి బి హెల్త్ విజిటర్ ప్రసాద్ బాబు , డాట్ ప్లస్ సూపెర్వైజర్ ధనలక్ష్మి , ఎం పి హెచ్ ఎస్ మురళిలతో మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షయ అనేది ఒక అంటువ్యాధి అని, టీ బి వ్యాధి పట్ల ప్రజలకు క్షుణంగా మీరంతా తెలియచేయాలని సూచించారు. టీ బి మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌ కూలై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, క్షయ రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో ట్యూబర్‌ కూలై బ్యాక్టీరియా వ్యాపిస్తుందని మనమందరం చదువుకున్నాం కానీ ఆ వ్యాధి పట్ల అప్రమత్తత ఎవరూ వహించడం లేదన్నారు. ఎంతో ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఒక్కసారి ఒంట్లోకి చేరిందంటే జీవితకాలం మన లోపలే రహస్యంగా దాక్కొని ఉంటుందన్నారు. ముఖ్యంగా మనలో రోగ నిరోధక శక్తీ తగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా చురుగ్గా మరింత వేగంగా మారుతుందనన్నారు. గతంలో టీబీ వస్తే రెండు మూడు నెలలు ఆసుపత్రులలో ఉండి చికిత్సలు తీసుకునేవారని , అయితే ఇప్పుడు ఆధునిక చికిత్సలు అమనకు అందుబాటులో వచ్చాయిన్నారు. టీబీ నుంచి కోలుకునేవాళ్ల సంఖ్య పెరిగిందని తెలిపారు క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని అమలులో ఉన్న పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ చర్యలు తీసుకుంటే సానుకూల ఫలితాలు సాధించవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa