పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలో గురువారం ఏడు మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు అర్బన్ ఎస్ఐ గోపీనాథరెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ గోపీనాథ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 1, 02, 200లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa