నంద్యాల లో చికెన్ వేస్టేజ్ దందా పై చర్యలు చేపట్టాలని యువత మున్సిపల్ కమీషనర్ వెంకటకృష్ణకు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని చికెన్ సెంటర్ యజమానులు చికెన్ వేస్టేజ్ ని చేపల దానా, ఆయిల్ తయారు చేసేవారికి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. టన్నులకొద్ది చికెన్ వేస్టేజ్ ను డబ్బాల ప్రకారం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వేస్టేజ్ తో ఆయిల్ తయారు కావడం, కొందరు చిన్న వ్యాపారులు తక్కువధరకు కొనుగోలు చేసి ఆయిల్ ను వాడుతున్నారని అన్నారు. మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈ విషయాలపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa