దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిపోయాయని అందరూ భావించి ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ కరోనా కేసులు అక్కడక్కడ పెరుగుతూ వస్తున్నాయి. అందులోను దేశ రాజధాని అయిన ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత రోజుతో పోల్చితే 26 శాతం పెరుగుదలతో మంగళవారం 632 కొత్త కేసులు నమోదవ్వడంతో వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. పాజిటివిటీ రేటు 7.72 శాతం నుంచి 4.42 శాతానికి తగ్గడంతో కాస్త ఉపశమనం పొందారు. పాజిటివిటీ రేటు ఢిల్లీలో దాదాపు మూడు రెట్లు పెరిగిందని, కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఢిల్లీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఘనాంకాలు తెలియజేస్తున్నాయి. రాబోవు రోజుల్లో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.