విజయవాడలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో రోజు రోజు కు భాదితుల సంఖ్య పెరిగిపోవడం తో ఫిర్యాదులను తీసుకోవద్దని చెబుతున్నారని బాధితుల సమాచారం. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు "బాధితులను ఎందుకు తీసుకున్నారు. అప్పో సప్పో చేసి కట్టేయండి అని, ఇలాంటివి మా సిఐ గారు తీసుకోవద్దని" పోలీసులు బయట నుండే భాదితులను వెళ్లగొడుతున్నారని బాధితుల సమాచారం. చేసేదేమీ లేక అప్పులు తెచ్చి లోన్ యాప్ లను లోన్లు కట్టి చేతులను కాల్చుకున్నట్లు వాపోతున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కొద్ది నెలల ముందు లోన్ యాప్ సంస్థలపై దాడులు చేయడంతో ఈ దందాకు కొంతకాలం తెరపడింది. తాజాగా మళ్లీ వెలుగులోకి వచ్చిన లోన్ సంస్థలు రుణ గ్రహీతలకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాయి. పోలీసుల వీరిపై చర్యలు సరైన చర్యలు తీసుకోకపోతే మరికొంత అమాయకులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.