వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా జిల్లాలో 35, 701 పొదుపు సంఘాలకు లబ్ధి చేకూరిందని కలెక్టర్ ఎం వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం జగన్ వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించగా కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 3, 62, 952 మంది సభ్యులకు రూ. 37. 83 కోట్లు సున్నా వడ్డీ రూపంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలలో మహిళలకు సంబంధించినవి అగ్రస్థానంలో ఉన్నాయ న్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ హెనీ క్రిష్టీన, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, వివిధ కార్పొరేషన్‌ల అధ్యక్షులు ఎం పురుషోత్తం, ముంతాజ్, నగర డిప్యూటీ మేయర్ సజీల పాల్గొన్నారు.