మాకు రాత్రివేళ పని చేయడం ఇష్టం అనే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. టెక్నాలజీ కారణంగా రాత్రీ పగళ్లకు తేడా తెలియకుండా చాలా మంది కాలం వెళ్లబుచ్చుతున్నారు. రాత్రి ఎక్కువ సేపు మేల్కొంటూ, బారెడు పొద్దెక్కేదాకా నిద్ర పోయేవారిని అనేక దుష్ప్రభావాలు చుట్టుముడుతున్నాయని ఎక్స్ టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. మనలో ఒక జీవ గడియారం ఉంటుంది. ఇది సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలకు అనుగణంగా హార్మోన్లను విడుదల చేస్తుంది. మన నిద్రను, మెలకువను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ బయో క్లాక్ ను ధిక్కరిస్తూ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటే డిప్రెషన్, తెలియని అలజడి, ఉద్వేగం వంటివి వస్తాయని పరిశోధనలో తేలింది. మొత్తం నాలుగు లక్షమ మంది దినచర్యను గమనించి ఈ పరిశోధన చేపట్టారు. పొద్దున్నే లేచే అలవాటు ఉన్నవారిలో కూడా సైట్ షిప్ట్ లలో పనిచేసినప్పుడు ఈ లక్షణాలు కనిపించాయి.