ఒంగోలు సభలో 35 నెలల్లో వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన మంచిని వివరించిన సీఎం వైయస్ జగన్.. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుర్మార్గాలపై, తప్పుడు రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందా..? చంద్రబాబు మాదిరిగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తే.. అమెరికా అవుతుందా..? అని దుష్టచతుష్టయాన్ని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న మంచిని ఓర్వలేక కడుపుమంటతో విషం చిమ్ముతున్న రాక్షసులతో, దుర్మార్గులతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. మనం చేస్తున్న మంచి పాలన వద్దని, మా బాబు పాలనే కావాలని, సంక్షేమ పథకాలు ఆపేయాలని దుష్టచతుష్టయం (చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్, టీవీ5, దత్తపుత్రుడు) అంటుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.