భానుడి భగభగలు మండిపోతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఎండలు మండుతున్నాయి. అనంతపురం, సత్యసాయి జిల్లాలు రెండింటిలోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. మధ్యాహ్నా సమయాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీనికితోడు పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ విద్యుత్ కోతలూ ఉంటుండటంతో జనం ఉక్కపోతాలతోనూ అల్లాడుతున్నారు.
ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏమిటని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల తరువాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయిందయ్యాయి. 43. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత 2016, 2017 తరువాత ఇప్పుడే నమోదయ్యింది. 2016వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గరిష్టంగా నమోదయిన ఉష్ణోగ్రత జిల్లాలో 44. 5 డిగ్రీలు. ఆ తరువాత 2017లో ఇదే మాసంలో 43. 7 డిగ్రీలు గరిష్టంగా నమోదయింది. ఆ తరువత 2018లో గరిష్టంగా 42. 3 డిగ్రీల, 2019లో 42. 9 డిగ్రీలు, 2020లో 41. 9 డిగ్రీలు, 2021లో 41. 6 డిగ్రీలు నమోదయింది. ఈ ఏడాది 2022లో ఏప్రిల్ 21వ తేదిన గరిష్టంగా 43. 1 డిగ్రీలు ఉష్ణోగ్రత జిల్లాలో నమోదయింది. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు కాస్త అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి.
గడిచిన నాలుగైదు రోజులుగా ఆకాశం ఒకవైపు మేఘావృతమైనట్టు కనిపిస్తున్నా మధ్యాహ్న సమయాల్లో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉక్కపోతలతో అల్లాడుతున్న జనం ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం అల్లాడుతున్నారు. దీనికితోడు అధికంగానున్న విద్యుత్ కోతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గంటల తరబడి కరెంటు లేకుండాపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు.