చెమటకాయల సమస్య రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరం చల్లగా, గాలి తగిలేలా ఉండడం ముఖ్యం. మీకు కుదిరితే చెమట కాయలు ఉన్న చోట కాసేపు బట్ట తొలగించి డైరెక్ట్‌గా గాలి తగిలేలా చూడండి. చిన్న పిల్లలకి అవసరం అనుకున్న సమయంలోనే వేయండి. మీరు కూడా వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి.
సింథటిక్ బట్టలు వేసుకోకండి. సమ్మర్ లో తేలిక పాటి రంగుల్లో వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోండి. సింథటిక్ బట్టల్లో గాలి ఆడదు. కాటన్ బట్టలు శరీరానికి గాలి తగిలేటట్లు చూస్తాయి.
స్కిన్ పొడిగా ఉంచుకోండి. ఈ వేడి లో స్కిన్ ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోండి. స్నానం అయిన తరవాత వెంటనే టవల్ తో పొడిగా అద్దుకోండి. గట్టిగా తుడవకండి. వెంటనే పౌడర్ చల్లుకుంటే చల్లగా ఉంటుంది.
బయట ఉన్న వేడికి లోపల నీళ్ళు ఆవిరైపోతాయి కాబట్టి ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవడం అవసరం. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, లస్సీ, మజ్జిగ వంటివి తాగుతూ ఉండండి.
వేపుళ్ళూ, స్వీట్సూ తగ్గించి సాలడ్స్, ఫ్రూట్స్ తీసుకోండి. ఒంట్లో వేడిని పెంచే ఆహారం తీసుకోకండి.
బయటి ఫుడ్ తీసుకోవద్దు. తాజా కూరగాయలు, ఇంట్లో వండిన వంటనే తీసుకోండి. పండ్లు ఎక్కువగా తీసుకోండి.
పెరుగు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. చల్లని పెరుగుని చెమట కాయల మీద అప్లై చేసి పదిహేను నిమిషాల పాటూ వదిలెయ్యండి. తరవాత చల్లని నీటితో కడిగేసి మెత్తటి బట్టతో అద్దండి. గట్టిగా తుడవకండి. పెరుగులో ఉన్న యాంటీ-బాక్టీరియల్ యాంటీ-ఫంగల్ ప్రాపర్టీస్ ఈ సమస్యకి త్వరగా చెక్ పెడతాయి.
వేసవికాలం గంధం పూసుకోడం అన్నది మనకి చాలా చిన్నపట్నించీ తెలిసిన విషయమే. ఈ గంధాన్ని చల్లటి పాలతో కలిపి పాక్ లా వేసుకోండి. ఆరిన తరవాత చల్లని నీటితో కడిగెయ్యండి. దీని వల్ల సన్ టాన్ కూడా పోతుంది. కాబట్టి రెగ్యులర్‌గా గంధం రాసుకోండి.