గన్నవరం మండలం కేసరపల్లి వికేర్ కళాశాలలో బుధవారం గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ట్రాఫిక్ సీఐ ఏ. రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు.
ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం దొరుకుతుంది విద్యార్థుల్లో విజ్ఞానం పెరగడానికి ప్రతి సమస్య పట్ల అవగాహన ఉండాలన్నారు. విజ్ఞాన సముపార్జన విద్యార్థులకు లక్ష్యంగా ఉండాలి. రోడ్డుమీద ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. రోడ్డుమీద వాహనాలతో పాటు మనుషులు జంతువులు ప్రయాణం చేస్తూ ఉంటాయి.
వాటిలో మనుషులు మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్డుపై ప్రయాణిస్తే ప్రమాదాల గురవుతారు. ప్రాణం కన్నా విలువ అయినది మరొకటిలేదని విద్యార్థులు గుర్తించాలి. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురికావడం ఖాయం. గేర్ వెహికల్స్ నడపాలని అనుకునేవారికి 18 ఏళ్లు వయసు పూర్తి కావాలి. గేర్ లేని వాహనం నడపాలనుకునే వారికి పదహారేళ్లు నిండాలి. అందువల్ల అందరూ డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేసేవారు ప్రమాదాలకు గురైతే భీమా సదుపాయము రాదు.
ఆటోల్లో ప్రయాణించేవారు నలుగురు సంఖ్యకు మించి ఎక్కరాదని సూచించారు. రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు వైట్ గీతలను చూసి నడపాలి. జిబ్రా లైన్స్ అంటే ఏమిటి, వైట్ లైసెన్సు అంటే ఏమిటి, లైసెన్స్ అంటే ఏమిటి, ఎల్ ఎల్ ఆర్ అంటే ఏమిటి వంటి సమస్యలను సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావు , కళాశాల ప్రిన్సిపాల్ డి శ్రీనివాసరావు , ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.