2022-23 నుంచి బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు సీట్లను ఎంసెట్ ఎంట్రెన్స్ ద్వారా భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రస్తుతం ఇంటర్ మార్కుల ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుండగా. ఇక నుంచి ఎంసెట్ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్ పరీక్షను తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. అయితే కాళోజీ ఆరోగ్య వర్సిటీ పంపించిన ప్రతిపాదనలతో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి బైపీసీ విద్యార్హతగా నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ఆధారంగా భర్తీ చేయనుండగా, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.