గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా లో బహిరంగంగా ఒక యువకుడు నడి రోడ్డు మీద బీటెక్ విద్యార్థినిని హత్య చేసినట్లు సాక్షాత్తు సీసీ కెమెరాలలో కనిపించడం జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలైన రమ్యకి న్యాయం చెయ్యాలి అని ప్రజా సంఘాలు అలానే, ప్రతి పక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. సీఎం జగన్ ఈ విషయం మీద స్పందించి ఆ కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం మరియు 10 లక్షల రూపాయలు ప్రభుత్వ తరుపు నుండి అందించడం జరిగింది. వీరిద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఐనట్లు పోలీస్ శాఖ తెలియచేసారు. ఐతే ఈ కేసుకి సంబంధించి గుంటూరు లోని స్పెషల్ కోర్ట్ తుది తీర్పు ఈ రోజు ఇవ్వడం గమనార్హం. ఎన్నడూ లేని విధంగా ఇతనికి ఉరి శిక్ష విధిస్తున్నట్లు కోర్ట్ తీరు వెల్లడి చేసింది. దీనితో ఈ కుటుంబానికి న్యాయం జరిగింది అని రాష్ట్రంలోని ప్రజలందరూ వాపోతున్నారు.