రేపు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఏప్రిల్ 30వ తేదిన రెండో అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణాన్ని బ్లాక్ మూన్ అని అంటున్నారు. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు భూ గ్రహం మీద నీడ పడుతుంది. ఆ సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
నాసా ప్రకారంగా సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలతో పాటుగా చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వేలో ఎక్కువగా కనిపించనుంది. అదేవిధంగా పశ్చిమ పరాగ్వే, నైరుతి బొలీవియా, ఆగ్నేయ పెరూ, నైరుతి బ్రెజిల్‌లోని కొన్ని ప్రదేశాల్లో అలాగే అంటార్కిటికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో కూడా సూర్యగ్రహణం ఏర్పడనుంది. పాక్షిక సూర్యగ్రహణం ఏప్రిల్ 30న మధ్యాహ్నం12:15 గంటలకు కనిపించినా ఎక్కువ ప్రాంతాల్లో తెల్లవారుజామున 2:11 గంటలకు కనిపించనుంది. అలాగే ఉదయం 4:07 గంటలకు గ్రహణం ముగిసే అవకాశం ఉంది. ఇండియాలో గ్రహణం కనిపించదని నాసా తెలుపుతోంది.