మరో వైపు ఏపీలో కూడా భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలువురు వడదెబ్బతో మరణించారని సమాచారం. అత్యవసరమైతేనే తప్పా బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మే 4 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వేడిగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలన్నారు.
ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దు.
వేడిగాలులకు జాగ్రత్తగా ఉండాలి. ఎండలో పని చేసేవారు నీరు తాగుతూ ఉండాలి.
ఎక్కువ సమయం ఎండలో ఉండకుండా చూసుకోవాలి.
సాధ్యమైనంత వరకు పనులు ఉదయం 10 లోపు, సాయంత్రం 5 తర్వాత చూసుకోవాలి.
బావుల వద్దకు పిల్లలను ఈతకు పంపవద్దు. వారి వెంట అనుభవజ్ఞులు తప్పనిసరిగా ఉండాలి.
ఎండకు వాహనాలు నిలుపవద్దు. పెట్రోల్, డీజిల్ ట్యాంకులు పేలే ప్రమాదం ఉంది.
వేడిగాలులకు, ఉక్కపోతలో చిన్న పిల్లలను ఉంచరాదు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.