ఏపీలోని రేపల్లెలో దారుణం జరిగింది. ఓ మహిళపై రైల్వే స్టేషన్‌లోనే శనివారం రాత్రి సామూహిక అత్యాచారం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి పనుల కోసం వచ్చిన మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం మండలం నుంచి కృష్ణా జిల్లాలోని నాగాయలంక వెళ్లేందుకు బాధితురాలు తన భర్తతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఈ క్రమంలో భర్తను కొట్టిన ముగ్గురు నిందితులు, అతడి కళ్లెదుటే బాధితురాలిపై అత్యాచారం చేశారు. వలస కూలీపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలను సేకరించారు.