అంబాజీపేట మండలంలోని ఇరుసుమండ గ్రామంలోని దొండపాటివారిపేటకు చెందిన వ్యక్తి మే 5వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మే 6వ తేదీన మరణించినట్లు స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇరుసుమండ గ్రామానికి చెందిన దొండపాటి బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అతని చిన్నాన్న దొండపాటి కృష్ణమూర్తి (తండ్రి మురుగులు) 5వ తేదీ రాత్రి దొండపాటివారిపేటకు ఎదురుగా ఉన్న ముక్కామల రోడ్డు దాటుతుండగా ముక్కామల వైపు నుండి వస్తున్న హూండా యునికార్న్ మోటార్ సైకిల్ స్పీడుగా వచ్చి ఢీకొట్టడం వలన తలకు గాయం అయ్యిందని, చికిత్సకు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మే 6వ తేదీ ఉదయం మరణించినట్లుగా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చైతన్య కుమార్ తెలిపారు.