పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకు సంతోషం రెట్టింపవుతుంది. కానీ తలసేమియా వ్యాధిబారిన పడ్డ పిల్లలతో కంగారు అధికమవుతోంది. వారికి అవసరమైనపుడుల్లా రక్తం ఎక్కించేందుకు కాళ్లరిగేలా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈ వ్యాధి కన్నా దాని పట్ల ఉన్న ఆందోళన వారిని మరింత మనోవేదనకు గురిచేస్తోంది. నేడు తలసేమియా దినాన్ని పురస్కరించుకుని... సప్త ఫౌండేషన్ శనివారం విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. బాధిత బాలల తల్లిదండ్రుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa