ఆలూ చిప్స్ ధర మహా అయితే 5 రూపాయలో, లేకుంటే 10 రూపాయలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవంలం ఒకే ఒక ఆలూ చిప్ కు రూ.1.63 లక్షలు ధర ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈకామర్స్ దిగ్గజం ‘ఈబే’లో ఓ వ్యక్తి ఒకే ఒక్క చిప్ ముక్కను ఇలా అంత ధరకు అమ్మకానికి పెట్టడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్ లో ఘటన చోటుచేసుకుంది.
ఈబేలో మే 3వ తేదిన ఈ చిప్ పీస్‌ను ఓ వ్యక్తి అమ్మకానికి పెడుతూ దీని ధర 2,000 యూరోలుగా తెలిపాడు. భారత కరెన్సీలో ఇది రూ.1.63 లక్షలు అవుతుంది. పుల్లటి క్రీమ్, ఆనియన్ ఫ్లేవర్‌తో ఈ చిప్‌ను తయారుచేశారని, ఆ వ్యక్తి డిస్క్రిప్షన్‌లో తెలిపాడు. ఈ చిప్ కు అరుదైన ముడత ఉండటాన్ని దీని ప్రత్యేకతగా ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే దీని ధరను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.