ఐపీఎల్-2022లో లీగ్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో ప్లే ఆఫ్‌కు చేరుకునే క్రమంలో కీలక మ్యాచ్‌లకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టు ఓపెనర్ పృథ్వీ షా ఢిల్లీ ఆడనున్న చివరి రెండు లీగ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే అతడు రెండు వారాలుగా జ్వరంతో బాధపడుతున్నట్లు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ చెప్పారు. టైఫాయిడ్ జ్వరం కారణంగా అస్వస్థతకు గురి కావడంతో పృథ్వీ షా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన షా చివరిసారిగా మే 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌లను చక్కగా ఎదుర్కొనే అద్భుతమైన నైపుణ్యం కలిగిన యువ బ్యాటర్ అని పృథ్వీ షాపై షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. అతను లేకపోవడం తమకు పెద్ద నష్టం అని వాట్సన్ చెప్పాడు. గత రెండు వారాలుగా అతను అస్వస్థతతో ఉన్నాడని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నానని తెలిపాడు. పృథ్వీ షా స్వయంగా తాను హాస్పిటల్ బెడ్‌పై ఉన్న పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. త్వరలో తిరిగి రానున్నట్లు పేర్కొన్నాడు.