ఈ మధ్య కాలంలో టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీడీపీ కి విశేష జనాదరణ కలిగింది . అలానే ప్రస్తుతం వైసీపీ పార్టీ నేతలు , గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ సూచనల మేరకు ప్రజాప్రతినిధులందరూ పల్లె బాట పట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం హీట్ పెంచాయి అనడంలో సందేహం లేదు. చంద్రబాబు పని అయిపోయిందని, టీడీపీ చనిపోతున్న పార్టీ అని ఆయన వ్యాఖ్యానించక, టీడీపీ నాయకులూ ఈయనపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... తమ్మినేని గారు.. మా నాయకుడు సమర్ధుడు కాబట్టే మూడు సార్లు సీఎం అయ్యారు.
ముదిగొండ మారణ హోమంలో ఏడుగురు రైతులను కాల్చి చంపింది వైఎస్ ప్రభుత్వం కాదా? మర్చిపోయారా? సీఐ రెడ్డి, ఎస్సై రెడ్డి, సీఎం రెడ్డి. యాదృచ్ఛికమా? బీసీ, మైనారిటీలకు ఒక్క రూపాయి అన్నా ఇచ్చారా? మా నాయకుడి శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన స్పందన చూసాక మీకు మైండ్ సరిగా పని చేయడం లేదనుకుటా.. లండన్ మందులు కాకపోయినా కనీసం మీకు ఉచిత కోటాలో వచ్చేవయినా వాడటం మంచిది. లేదంటే అంతిమ యాత్ర లాంటి అడ్డమైన కూతలు మీ నోటి వెంట రావడం బాగోదు. మీ నోరు అలాంటిదే కానీ మీ పదవి గౌరవప్రదమైనది కదా? అని దుయ్యబట్టారు.