రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ కేన్సర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. పుతిన్‌కు ఉన్న అనారోగ్య సమస్య ఏమిటో ఖచ్చితంగా అంచనా వేయలేమని, అయితే కేన్సర్ నయమయ్యేదో కాదో కూడా తెలియదని చెప్పారు. అమెరికాకు చెందిన ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, పుతిన్ వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. రష్యా నుంచి అందుతున్న సమాచారం మేరకు పుతిన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
ఈ విషయాన్ని రష్యాకు చెందిన ఓ సంపన్నుడు కూడా ధ్రువీకరించినట్లు అమెరికా మీడియా తెలిపింది. తాను పుతిన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆ వ్యక్తి చెప్పినట్లు పేర్కొంది. పుతిన్ అనారోగ్యం నిజమేనని, కేన్సర్ చికిత్సలో భాగంగానే ఆయన వెన్నెముకుకు శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఇదంతా ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందే జరిగిందని తెలిపారు.