దేశ స్వాతంత్య్రం కోసం అత్యంత చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ జీవిత చరిత్ర ను కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా తొలగించడాన్ని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యన్. మాధవ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర ను వక్రీకరించడమే ధ్యేయం నూతన జాతీయ విద్యా విధానం తీసుకుని వచ్చి అందులో భాగంగా అభ్యుదయ భావాలు కలిగిన స్వాతంత్ర్య సమర యోధుల చరిత్రను తొలగించడంలో భాగంగా ఎంతో మంది యువతకు స్ఫూర్తి ప్రధాత అయిన భగత్ సింగ్ జీవిత చరిత్ర ను కుట్రపూరితంగా పాఠ్యాంశంగా తొలగించడం బిజెపి రాజ్యాంగ ఉల్లంఘనలకు నిదర్శనమని పేర్కొన్నారు.
భారత దేశ పౌరులు జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని, స్వాతంత్ర్య సమర యోధులను గౌరవించడం ప్రాథమిక విధులు లో భాగమని అటువంటి ప్రాథమిక విధులు కంటే బిజెపి రహస్య అజెండా కే అధిక ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే భారత రాజ్యాంగ ప్రవేశిక లో పేర్కొనబడిన లౌకికవాదం, ప్రజాస్వామ్యం పాఠ్యాంశాలను పౌరశాస్త్రము నందు తొలగించారని ఈ దేశం ఎటువైపు పయనిస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని ఆవెదన వ్యక్తం చేశారు.
భారత జాతిపితగా గాంధీజీని భారత పౌరులు కీర్తిస్తుంటే మరోవైపు గాంధీజీ ని చంపిన గాడ్సేను కీర్తిస్తూ, స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారికి ఊడిగం చేసిన సావర్కర్ ను, స్వాతంత్ర్య ఉద్యమంలో ఏ నాడు పాల్గొనని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు లో ఒకరైన హెగ్డేవర్ లాంటి వ్యక్తులను కీర్తిస్తూ వారి గురించి పాఠ్యాంశాలులో చేర్చడమంటే దేశ విద్యావిధానంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రను వక్రీకరించడానికి కుట్రపూరితమైన ప్రయత్నాలను చేస్తున్నదని ఈ విధానాలను అడ్డుకోకపోతే భారత దేశ చరిత్ర పూర్తి స్థాయిలో వక్రీకరణ కు గురి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ రవి, ప్రసన్న, ఉరుకుందు, నాయకులు శివ, మహేష్, భాస్కర్, రాజేష్, భూపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.