చిత్తూరు: గంగాధర నెల్లూరు మండలం , కొట్ర కోన గ్రామపంచాయతీ నందు జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనుల ద్వారా ప్రతి రోజు పనులు కల్పించడంతోపాటు ఆదాయం సమకూర్చడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా ఉపాధిహామీ జాబ్ కార్డు ఉండి రానివారికి అవగాహన కల్పించి పనులకు తీసుకురావాలని కోరారు. ఈ ఉపాధి పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ. పి. డి. మృత్యుంజయరావు మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.