భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోరిన సమసమాజ నిర్మాణాన్ని సీఎం వైయస్ జగన్ చేసి చూపిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల కోసం సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన సామాజిక విప్లవాన్ని బస్సు యాత్రలో ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. గతంలో మంత్రిపదవుల్లో 30 శాతం వెనుకబడిన వర్గాలకు ఇస్తే.. చాలా గొప్పగా చెప్పుకునేవారని, సీఎం వైయస్ జగన్ తన మంత్రివర్గంలో 77 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారన్నారు. నాలుగురోజుల పాటు సాగే బస్సుయాత్రలో 26న విజయనగరంలో, 27న రాజమండ్రిలో, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.