ఏపీ ప్రభుత్వం పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించింది. 2022-23 సీజన్ కోసం కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ.6,850 లుగా పేర్కొంది. రాష్ట్రంలో పసుపు 30,518 హెక్టార్లలో సాగవుతోంది. ఏటా 3.50 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. గడిచిన సీజన్ లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పసుపు రూ.7,900కు పైగా పలికింది. ప్రస్తుతం క్వింటాల్ రూ.6,500కు పైగా పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో మార్కెట్ లో పసుపుకు రేటు పెరిగే అవకాశం ఉంది.