శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థను గుర్తింపు రద్దు చేయాలని ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ముందు గురువారం ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జాన్ మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి జీవో నెంబర్ 1 ను కూడా పాటించకుండా విచ్చలవిడిగా కదిరి పట్టణంలో ప్రతి వీధిలోనూ గుంపులు గుంపులుగా ప్రచారం చేస్తూ అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.
ఎల్ కే జి కి 26, 000 వేల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా తీసుకొని వేల రూపాయలు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పాఠశాలలో అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న సిబ్బందిని బయటకు పంపించి తరగతి గదిని మూసివేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ కదిరి పట్టణ అధ్యక్షుడు యశ్వంత్, ఉపాధ్యక్షులు బబ్లు, విజయ్ కుమార్, సహాయ కార్యదర్శులు రాజు, హరి కుమార్, మహేష్, నాయకులు ప్రవీణ్, అరుణ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.