పాకిస్థాన్ ప్రభుత్వం అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచింది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరత వంటి సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ప్రజలపై మరో పిడగు పడినట్లయింది. తాజా పెంపుతో అక్కడ ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.179.85, డీజిల్ ధర రూ.174.15, కిరోసిన్ ధర రూ.155.95, లైట్ డీజిల్ ధర రూ.148.41 కు చేరాయి.