షేర్ మార్కెట్ లో ఎన్నో కంపెనీలు దూసుకుపోయినా కొన్ని మాత్రమే రారాజుగా మార్కెట్ సామ్రాజ్యాన్ని ఏలుతుంటాయి. వాటిలో రారాజు కోహినూర్ ఫుడ్స్ అని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అయినా కూడా కొన్ని షేర్లు మాత్రం తారాజువ్వలా దూసుకుపోతున్నాయి. ఇలాంటి షేర్లలో కోహినూర్ ఫుడ్స్ కూడా ఒకటి. ఇది పెన్నీ స్టాక్. ఈ షేరు చాలా రోజులుగా అప్పర్ సర్క్యూట్ తాకుతూ వస్తోంది. మల్టీబ్యాగర్ షేరుగా అవతరించింది. షేరు ధర రెండు నెలల కాలంలోనే రూ.7.75 నుంచి రూ. 38.40కు చేరింది. అంటే దాదాపు 395 శాతం మేర ర్యాలీ చేసింది. ఇది మామూలు విషయం కాదు. తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వచ్చాయి.
ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ షేరు గత నెల రోజుల కాలంలో రూ. 14.85 నుంచి రూ. 38.40కు చేరింది. అంటే ఈ కాలంలో షేరు ధర 160 శాతం పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంగా ఈ షేరులో ఎలాంటి ట్రేడింగ్ లేదు. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాతి నుంచి షేరు ధర మాత్రం క్రమక్రమంగా పెరుగుతూనే వస్తోంది. 2 నెలల్లోనే దాదాపు 395 శాతం ర్యాలీ చేసింది.
కోహినూర్ షేరు ధర ర్యాలీ ఆధారంగా చూస్తే ఒక ఇన్వెస్టర్ నెల రోజుల కిందట ఈ షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు వీరి ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 2.6 లక్షలుగా మారి ఉండేది. అదే రెండు నెలల కిందట ఇన్వెస్టర్లు ఈ మల్టీ బ్యాగర్ షేరులో డబ్బులు పెట్టి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 4.95 లక్షలకు చేరి ఉండేది. షేరు ధర రెండు నెలల కిందట కేవలం రూ. 7.75 మాత్రమే.
కోహినూర్ ఫుడ్స్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 142 కోట్లుగా ఉంది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ తక్కువే. 9978గా ఉంది. ఈ మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ సగటు వాల్యూమ్ గత 20 రోజుల్లో 8787గా ఉంది. షేరు ధర ప్రస్తుతం రూ.38.4 వద్ద ఉంది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. అదానీ గ్రూప్ ఈ కంపెనీకి కొనుగోలు చేయడం వల్ల ఈ షేరు ధర పరుగులు పెడుతోందని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం వంటివి చేస్తుంది. బాస్మతి రైస్, రెడీ టు ఈట్, రెడీమెడ్ గ్రేవీ, కుకింగ్ పేస్ట్‌లు, చట్నీస్, స్పైసెస్, సీజనల్ ఫ్రొజెన్ బ్రెడ్స్, స్నాక్స్, ఎడిబుల్ ఆయిల్స్ ఇలా పలు రకాల ప్రొడక్టులు అందిస్తుంది.