ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. త్వరలో పే స్కేల్ అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్వయంగా గురువారం ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడే, పేస్కేల్ అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa