ప్రతి ఏటా జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రోజూ కాసేపు సైకిల్ తొక్కడం వల్ల బీపీ, షుగర్ సమస్యలు రావు. గుండెజబ్బుల ప్రభావం అంతగా ఉండదు. అధిక బరువును సైకిల్ తొక్కి తగ్గించుకోవచ్చు. సైకిల్ రోజులో ఒకసారైనా తొక్కితే ఉషారుగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫిట్ గా యాక్టీవ్ గా ఉండగలుగుతారు. కాబట్టి ఇక నుంచి సైకిల్ తొక్కడం ప్రారంభించండి.