టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాల్లో టమాట పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లలోకి టమాట తక్కువ వస్తుంది. దీంతో డిమాండ్ పెరిగి సప్లయి తగ్గింది. ఈ ప్రభావంతో హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కిలో టమాట రూ.100 పైకి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కిలో టమాట రూ.80కి పైగా ఉంది. మరో నెల వరకు టమాట ధర ఇలానే ఉండనుంది. టమాట రైతులు ఆనందంగా ఉన్నా వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.