జనసేన పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే గుణపాఠం చెబుతామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు. అదే సమయంలో సైన్యంపై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న నాగబాబు శుక్రవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలతో ఉత్తరాంధ్ర ఉద్యమకారులు ముందుకు సాగుతున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa