అమెరికాలో తుపాకీ సంస్కృతి ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా ఫిలడెల్ఫియాలోని ప్రసిద్ధ సౌత్ స్ట్రీట్ నైట్‌లైఫ్ ప్రాంతంలో ఆదివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. దీనిపై ఫిలడెల్ఫియా పోలీస్ కమీషనర్ డానియెల్ ఔట్లా స్పందించారు. బాధితుల్లో ఒకరు మరొక వ్యక్తితో గొడవకు దిగారని, అదే కాల్పులకు కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa