జుట్టును బలోపేతం చేయడంతో పాటు, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది మందారం. చుండ్రు వంటి జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. మందారం పువ్వులే కాదు ఆకులను ఉపయోగించడం ద్వారా కూడా జుట్టును సిల్కీగా, బాగా పెరిగేలా చేసుకోవచ్చు.
మందారంలో ఉండే విటమిన్లు ఖనిజాలు జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. మందారం పువ్వులలో ఉండే విటమిన్లు హెయిర్ ఫాలికల్స్ ను గట్టిగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మందారంతో తయారు చేసిన నూనెను జుట్టుకు రాయటం వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది. మందారలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఇది చుండ్రును తగ్గిస్తుంది.
మందార పువ్వును ఆకులతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమానికి 4స్పూన్ల పెరుగు కలపండి. ఇప్పుడీ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా రాసుకుని ఒక గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, షాంపుతో తల స్నానం చేయండి.ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. పెరుగులో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.