ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సవాళ్లకు సవాల్ విసిరి...ఉన్నత స్థాయికి ఎదిగి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 11:54 PM

అన్ని ఉండి పైకి ఎదగడం పెద్ద విషయమేమీ కాదు.  ఏమీ లేకున్నా,,అందులోనూ  జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని పైకి ఎదిగేవారు అసలైన విజేతలు. ఆ జాబితాలో రాధికా గుప్తా పేరు చేర్చవచ్చు. నేడు దేశంలో అత్యంత పిన్న వయస్కులైన సీఈవోలో ఒకరు.. రాధికా గుప్తా. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 33 ఏళ్ల వయసులోనే రాధికా గుప్తా ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు. హ్యుమన్స్ ఆఫ్ బొంబైలో రాధిగా గుప్తా షేరు చేసిన స్టోరీ ప్రస్తుతం ప్రతి ఒక్కర్ని కదిలిస్తోంది. ఒకానొక సమయంలో ఉద్యోగం రాక చనిపోదామని, ఆత్మహత్యయత్నం చేసుకున్న రాధికా.. ప్రస్తుతం దేశంలో డైనమిక్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్‌లో ఒకటైన డెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కి సీఈవో అయ్యారు. పుట్టుకతోనే వంకర మెడతో జన్మించిన రాధికా గుప్తాకు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తన అవయవలోపంతో ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ సమయంలోనే 22 ఏళ్లకే రాధికా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ తన స్నేహితురాలు కాపాడటంతో బతికానని, తనని మానసిక వైద్యనిపుణుల దగ్గరకు తీసుకెళ్లి సేవ్ చేసినట్టు రాధిగా గుప్తా తెలిపారు. ఇలా స్నేహితురాలి సాయంతో బతికిన రాధికా ఆ తర్వాత ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎలా అయ్యారో ఓసారి చూద్దాం...


‘‘నేను వంకర మెడతో పుట్టాను. ప్రతి స్కూల్‌లో నేను ఓ కొత్త విద్యార్థినే. ఎందుకంటే నాన్న దౌత్యవేత్త కావడంతో నేను నైజీరియాకు వెళ్లకు ముందు పాకిస్తాన్‌లో, న్యూయార్క్‌లో, ఢిల్లీలో పెరిగాను. నా స్కూల్‌లో స్నేహితులు నన్ను సింప్సన్స్‌లో ఉన్న ‘అప్పు’ క్యారెక్టర్‌తో పోల్చేవారు. అంతేకాక మా అమ్మతో పోల్చుతూ నన్ను గేళిచేసేవారు. మా అమ్మ కూడా అదే స్కూల్‌లో పనిచేసేవారు. తను చాలా అందంగా ఉంటుంది. అమ్మతో పోల్చే సమయంలో నీనెంత అందహీనంగా ఉన్నానో చెప్పేవారు. ఆ సమయంలో నా కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినేది. అవయవలోపంతో నా చిన్నతనమంతా అభద్రతాభావాల మధ్యనే పెరిగాను. వీటి నుంచి బయటపడేందుకు ఉద్యోగం చేయాలనుకున్నా. కానీ7 జాబ్ అప్లికేషన్లు రిజక్ట్ అయ్యాయి. దీంతో 22 ఏళ్ల వయసులోనే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కిటికీలో నుంచి చూస్తూ కిందకి దూకేశాను. నా స్నేహితురాలు కాపాడింది. సైక్రియాక్టిక్ వార్డులో నాలుగు చక్రాల కూర్చికే పరిమితం కావాల్సి వచ్చింది. నా మానసిక ఒత్తిడికి చికిత్స అందించారు. జీవితంలో ఏదీ సాధించలేనేమో అనే సమయంలో, నాకు ఎదురొచ్చిన ఒక అవకాశం నా జీవితాన్నే మార్చేసింది. కేవలం ఆ ఒక్క కారణంతోనే నేను ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాను. నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఆసుపత్రి నుంచి బయటికి వచ్చాను. అదే నా చివరి ప్రయత్నం అనుకున్నా. ఆ ఉద్యోగమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. నాకు మెకెన్సీలో ఉద్యోగం వచ్చింది.


అప్పటి నుంచి నా జీవితానికి ఒక మార్గం దొరికింది. కానీ మూడేళ్ల తర్వాత, 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభం నుంచి కోలుకున్న తర్వాత, నేను దేశం మారాలనుకున్నా. 25 ఏళ్ల వయసులో భారత్‌కు వచ్చాను. భారత్‌కు వచ్చిన తర్వాత నా భర్త, ఫ్రెండ్‌తో సొంతంగా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేశాను. కొన్నేళ్ల తర్వాత, మా కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. నేను అప్పుడే కార్పొరేట్ నిచ్చెన ఎక్కాను. ఏదైనా అవకాశం వస్తే ఎల్లప్పుడూ నేను ముందు ఉండేదాన్ని. కానీ ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కి కొత్త సీఈవోనే ఎంపిక చేసుకునే సమయంలో మాత్రం నేను వెనుకడగు వేశాను. కానీ నా భర్త ప్రోత్సహించారు. ఆ ఉద్యోగానికి నేనే బెస్ట్ పర్సన్ అని చెప్పారు. కొన్ని నెలల తర్వాత 33 ఏళ్లలోనే దేశంలోనే అతి పిన్న వయస్కులైన సీఈవోలలో ఒకరిగా బాధ్యతలు చేపట్టాను. ఒకప్పుడు నేను నా లోపాన్ని చూసుకుని ఎంతో బాధపడేదాన్ని. కానీ నాలా ఎవరూ బాధపడకూడదని ‘లిమిట్‌లెస్’ అనే పుస్తకాన్ని రాశాను.’’ అని రాధిగా గుప్తా తన జీవిత కథనాన్ని షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa