ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందర్నీ ఆకర్షిస్తున్న... మహింద్రా స్కార్పియో

business |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 11:53 PM

కొన్ని వాహనాలను నడిపితే దాని రాజసమే వేరుగా ఉంటుంది.  బిగ్ బాక్సీ డిజైన్, హెవీ స్పోర్ట్ యుటిలిటీ వీలర్ వెహికిల్స్‌కు భారత్ మార్కెట్లో మస్తు క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌తో మహింద్రా స్కార్పియో ఎస్‌యూవీ అభిమానులకు ఉత్తమమైన ఎంపికగా నిలుస్తోంది. దేశీయ కంపెనీకి చెందిన ఈ ఎస్‌యూవీని అభిమానించని వాళ్లంటూ లేరు. రోడ్డుపై ఈ వెహికిల్ వెళ్తుంటే ప్రతి ఒక్కరూ కన్ను దానిపైనే. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ మెచ్చే కారుగా మహింద్రా స్కార్పియో నిలుస్తోంది. మహింద్రా స్కార్పియోకున్న బాక్సీ డిజైనే చాలా మందికి తొలి ఎంపికగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ కారును అభిమానించడానికి కారణం కూడా ఈ డిజైనే. దీంతో పాటు సరసమైన ధరలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంది. ధర అందుబాటులో ఉంటే.. సాధారణ ప్రజలు ఆ వెహికిల్‌ను ఎక్కువగా అభిమానిస్తారు. అదే స్కార్పియోకి ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.


స్కార్పియో ధరను కంపెనీ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ధర ఎక్స్‌షోరూంలో రూ.13.54 లక్షలుగా ఉంది. ఈ వెహికిల్ లాంచ్ సమయంలో దీని ధర కేవలం రూ.10 లక్షలు మాత్రమే. ప్రస్తుతం స్కార్పియోను సరికొత్త అవతారంలో మార్కెట్లో ప్రవేశపెట్టాలని మహింద్రా చూస్తోంది.


మహింద్రా స్కార్పియో పొడవు 4,456 మిల్లిమీటర్లు, వెడల్పు 1,820 మిల్లిమీటర్లుగా ఉంది. ఈ ఎస్‌యూవీ ఎత్తు 1,995 మిల్లిమీటర్లు. ఎత్తు, పొడవు, వెడల్పులతోనే ఈ ఎస్‌యూవీ అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. ఒక్కో లీటరుకి 15 కి.మీల వరకు ఇంధన సామర్థ్యాన్ని ఈ వెహికిల్ అందిస్తుంది. ఆకట్టుకునే ఈ ఫీచర్లతోనే మహింద్రా స్కార్పియో చాలా మంది మెచ్చే ఎస్‌యూవీగా నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి డైరెక్టర్ రోహిత్ శెట్టి వరకు ఈ కారును అభిమానిస్తున్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తన బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ వెహికిల్స్‌లో ఈ ఎస్‌యూవీ ఒకటిగా ఉండేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa