మృగశిర కార్తె మొదటిరోజును దేశవ్యాప్తంగా వివిధప్రాంతాల్లో జరుపుకుంటారు. భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజున ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. అంతేకాకుండా ఈరోజున చేపలు తినేందుకు చాలా మంది మొగ్గు చూపుతారు. ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు న్యూట్రిషన్లు ఎందుకంటే దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. అయితే చేపల వల్ల కలిగే లాభాలేమిటో.. వాటిని తింటే ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషన్లు చెప్తున్నారు. చేపల్లోని కొవ్వులు సులభంగా జీర్ణమై.. మీకు శక్తిని అందిస్తాయి. కాబట్టి దీనిని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తినవచ్చు. చేపలలోని కొవ్వు మన శరీరంలోని రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. డీహెచ్ఏ, ఈపీఏ వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపునకు మేలు చేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుపరుస్తుంది.
చేపలలో విటమిన్ బి12, రైబోఫ్లావిన్, నియాసిన్, బయోటిక్, థయామిన్ పుష్కలంగా ఉంటాయి. మెరైన్ ఫిష్ కాలేయంలో విటమిన్ ఎ, డి, ఇ పుష్కలంగా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్తమా, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి చేపలు మంచి ఆహారం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పిల్లల తల్లులకు ఇది మంచిది. పిల్లల్లో చేపలు జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాయి. దేశవాళీ చేపల్లో ఇనుము, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో చేపలను ఏ రూపంలోనైనా తిన్నా సరే మన ఆరోగ్యానికి చాలా మంచిది.
స్థానికంగా లభించే పెద్ద చేపలను ఇంగువ, దాల్చిన చెక్కతో ఉడికించి తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా కూడా రుజువైంది. గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమేహం ఉన్నవారికి చేపలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి.