సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఒక మహిళ అలాగే పురుషుడు దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని పెళ్లి గానే.. చట్టం పరిగణిస్తుంది అని దాన్ని అక్రమ సంబంధంగా భావించరాదని సుప్రీం కోర్టు సోమవారం ప్రకటించింది.అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా నిరాకరించే రాదని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు.ఈ కేసులో ఒక జంట దీర్ఘ కాలంగా సహజీవనం చేసింది. వారికి ఒక కుమారుడు జన్మించాడు అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేకపోవడం కారణంగా వారికి పుట్టిన అక్రమ సంతానానికి పూర్వీకులు కేరళ హైకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా ఈ కేసు పై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలను విన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహజీవనం చేస్తే అది అక్రమ సంబంధం కాదని.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు లేనని స్పష్టం చేసింది.