కోవెలకుంట్ల - జమ్మలమడుగు రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని కోవెలకుంట్ల పట్టణానికి చెందిన బుజ్జి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణంలోని ఎల్‌ఎం కాంపౌండ్ కు చెందిన బుజ్జి సైకిల్ పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa