అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బీహార్ లో ఆందోళనల కారులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. తెలంగాణలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా ఆశావహులు శనివారం బీహార్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రతిపక్ష పార్టీలు సమ్మెకు తమ మద్దతును అందించాయి.
ఈ బంద్ కారణంగా రైళ్లు, బస్సు సేవలకు సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అలాగే నగరాల్లో మార్కెట్లు, షాపులు మూతబడనున్నాయి. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో అభ్యర్థులు రణరంగం సృష్టించారు. రైల్వే ట్రాక్‌పైమ పడుకుని నిరసనలు తెలిపారు. కొన్ని రైల్వే స్టేషన్లలో ఫర్నిచర్‌కు నిప్పుపెట్టారు. ఓ రైలు అద్దాలను పగులగొట్టి బోగికి నిప్పుపెట్టారు. అదేవిధంగా ఓ ఎమ్మెల్యే కారును అడ్డగించి దాడి చేశారు. ఇండియన ఆర్మీ లవర్స్ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని నినాదాలు చేశారు. కొన్నిచోట్ల పోలీసులపై రాళ్లురువ్వారు.
మరోవైపు బీహార్‌లో జరుగుతున్న ఈ నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీనే కారణమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు. దీనికి ఆ పార్టీ దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని విమర్శించారు. నిరసనల్లో బీహారీలు చనిపోతున్నారని, బీహార్‌కు ఆర్జేడీ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. కొత్తగా కేంద్రం తీసుకొచ్చి ఈ అగ్నిపథ్ పథకాన్ని ఆయన సమర్థించారు. యువకులు ఎంతో ఉపయోగంగా ఉందని అన్నారు.