అమాంతంగా పెరిగిన కండోమ్ ధరలతో వెనిజూలలోని టీనేజ్ గర్భీణీలకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా టీనేజ్ గర్భిణీలు ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటిగా నిలుస్తోంది. దీంతో ఆ దేశంలో అబార్షన్ చట్టాలను కఠినతరం చేశాయి. పెద్దఎత్తున కండోమ్‌లకు డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కల వచ్చాయి. కండోమ్ ధరలు ఓ రేంజ్‌లో పెరగడంతో వెనిజులాలో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకుంటున్నారు. కానీ వేరే ఆప్షన్ లేదు. కావాలి అనుకుంటే కండోమ్ కొనగోలు చేయాల్సిందే.. లేదంటే ఊరికే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
కండోమ్ ధరలను తగ్గించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. వెనిజులాలో కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలు పలకడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. అవును నిజమే అప్పుడే పెళ్లయిన కపుల్.. లేదంటే పెళ్లి చేసుకునే లవర్స్‌కు కండోమ్ కంపల్సరీ.. మరీ వారు ఒకసారి కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది.