ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని చెన్నముక్కపల్లె సచివాలయం పరిధిలో గల ఆంజనేయపురం గ్రామంలో డెంగ్యూ వ్యాధి నమోదు అవ్వడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. నాగరాజు, జిల్లా మలేరియా అధికారిణి మనోరమ ఆదేశాల మేరకు ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు ఆధ్వర్యంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి మాచనూరు రాఘవయ్య, సూపర్ వైజర్ ఎన్. సునీల్ కుమార్ ఆంజనేయపురం చేరుకొని దోమలను నాశనం చేసే సైపనేత్రియం అనే మందును ఇంటింటికి పిచికారీ చేయించారు.
అలాగే ఏ ఎన్, ఎమ్, లు ఆశాలతో లార్వా, జ్వరాల సర్వే చేయించి, గ్రామ ప్రజలకు ఆరోగ్య విద్య ద్వారా దోమల నివారణ చర్యల గురించి చైతన్యం కలిగించారు.