గూగుల్ సంస్థ భారత్‌లో స్టార్టప్ స్కూల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10 వేల స్టార్టప్‌లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్‌గా తొమ్మిది వారాల పాటు గూగుల్ నిర్వహించనుంది. స్టార్టప్‌ల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.