కరోనా వైరస్ మనదేశంలో నిలకడగా సాగుతోంది. మరీ పెట్రేగిపోకుండా...అలా అని శాంతించకుండా నిలకడ వైఖరిని కరోనా వైరస్ ప్రదర్శిస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా వుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,265 మంది కరోనా నుంచి కోలుకోగా... 20 మంది మృతి చెందారు. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,043కి చేరుకున్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,36,52,944కు చేరుకుంది. వీరిలో 4,29,96,427 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 3.23 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 10,64,038 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.