ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాకు ధీటుగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్

international |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 11:05 PM

 


కరోనా వైరస్ కు ధీటుగా ప్రపంచవ్యాప్తంగా  మంకీపాక్స్ వైరస్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే  మంకీపాక్స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మంకీపాక్స్ కేసుల సంఖ్య 7,600కి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 50 కంటే ఎక్కువ దేశాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. జూలై 11 నాటికి ఆస్ట్రేలియాలో 23 కేసులు, న్యూజిలాండ్‌లో ఒక కేసు సింగపూర్‌లో రెండు కేసులు, దక్షిణ కొరియాలో రెండు కేసులు, తైవాన్‌లో ఒక కేసులు నమోదయ్యాయి.


జూలై 8 నాటికి ఆస్ట్రియా 62 కేసులను, జూలై 5 నాటికి బెల్జియం 168 కేసులను గుర్తించాయి. జూన్ 30 నాటికి బల్గేరియాలో మూడు కేసులు, క్రొయేషియాలో ఒక నమోదయ్యాయి. చెక్ రిపబ్లిక్ జూలై 4 నాటికి తొమ్మిది కేసులను నిర్ధారించింది. జూలై 8 నాటికి డెన్మార్క్ 28 కేసులను నిర్ధారించింది. జూలై 8 నాటికి ఎస్టోనియాలో రెండు కేసులు, జూలై 11 నాటికి ఫిన్లాండ్‌లో 13 కేసులు, జూలై 7 నాటికి ఫ్రాన్స్ 721 కేసులు నమోదయ్యాయి. జార్జియాలో ఒక కేసు, జర్మనీలో 1,556 కేసులు, జిబ్రాల్టర్ ఒక కేసు, గ్రీస్‌లో 11 కేసులను ధ్రువీకరించడం జరిగింది.


ఇక హంగేరీ, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్, ఇటలీ, LATVIA,లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్‌,పోర్చుగల్, రొమేనియా, సెర్బియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్‌లలోనూ కేసులు వెలుగు చూశాయి. యూకేలో అత్యధికంగా జూలై 8 నాటికి 1,552 కేసులు నిర్ధారణ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్‌లో 1,482, స్కాట్లాండ్‌లో 41, ఉత్తర ఐర్లాండ్‌లో 11, వేల్స్‌లో 18 ఉన్నాయి. వీటితో పాటు ఆఫ్రికా దేశాల్లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. జమైకా, ఈక్వెడార్, పెరు, వెనుజులా వంటి కంట్రీల్లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు భారత దేశంలో మంకీపాక్స్‌కు సంబంధించి ఒక కేసు కూడా రిజిస్టర్ కాలేదు.


ఇదిలావుంటే మంకీపాక్స్ వైరస్‌ను మొదట్లో కోతుల్లో గుర్తించారు. ఎక్కువగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో వ్యాప్తి చెందేది. అక్కడే కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు మాత్రం వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారితో సన్నిహతంగా మెలిగితే.. వారికి వైరస్ అంటుకుంటుంది. జ్వరం, శరీరంపై మచ్చలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి వేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి కాంగోలో ఈ వ్యాధిని గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com