మనుషులను రవాణ చేయాల్సిన ఆటోవాలా వారిని పశువులను కుక్కినట్లు కుక్కి గయ్యానికి చేర్చేందుకు బయలుదేరాడో ఓ ఆటోవాలా. సీన్ కట్ చేస్తే ఆ ఆటోను సీజ్ చేసిన పోలీసులు ఆటోవాలకు భారీ ఫైన్ కూడా విధించారు. సాధారణంగా ఆటోలో ఎక్కువమందినే ఎక్కించుకుంటారు. టికెట్ సర్వీస్‌పై వెళ్తామనే ఆశతో ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు. ఆటో సైజ్‌ను బట్టి మహా అయితే ఐదు, ఆరుగురు లేదా పదిమంది వరకు ఎక్కించుకుంటారు. ప్రతి సిటీలోనూ కనిపించే దృశ్యమే. అలా ప్రయాణించడం ప్రతి ఒక్కరికి అలవాటుగా కూడా మారింది. ఇలానే ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆటోవాలా పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఫతేపూర్‌లో రద్దీగా అతి వేగంగా వెళ్తున్న ఆటోను పోలీసులు ఆపారు. అందులో ఉన్న ప్రయాణికులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆటోనే సీజ్ చేశారు.
ఆ ఆటోవాలా ఏడుగురు కూర్చోవాల్సిన ఆటోలో ఏకంగా 27 మంది కూర్చొబెట్టాడు. అందులో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. అంగుళం కూడా గ్యాప్ లేకుండా అందరిని ఎక్కించాడు. పోలీసులు వెంటనే వాందరిని కింద దింపి లెక్కించారు. ఆ ప్రయాణికులను, ఆటోను చూసి డ్రైవర్‌పై కేసు బుక్ చేశారు. వెంటనే ఆటోను సీజ్ చేశారు. అంతేకాదు రూ.11,500ల జరిమానా కూడా విధించారు. అయితే ఆ ప్రయాణికులు ఆదివారం బిందాకి ప్రాంతంలోని సమీపంలోని మసీదు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఎవరో షూట్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అంతమందితో ఆ ఆటో ఓవర్ స్పీడ్‌లో వెళ్తోందంటే దీన్ని గిన్నిస్‌బుక్లో ఎక్కించాల్సేందేనని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఆటోకి లైసెన్స్ తీసుకుని బస్సు నడుపుతున్నాడు అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. అలాగే చాలామంది దానిని మినీ బస్సుగా అభివర్ణించారు.
అయితే ఇలా ఎక్కువమంది వెళ్లే టైంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు అలాంటి వాహనాల తమ దృష్టికి వచ్చినప్పుడు కచ్చితంగా జరిమానా విధిస్తుంటారు. కాగా మహారాష్ట్రలోని నాసిక్ నుంచి వెళ్తున్న ఓ టెంపో ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర పల్టీ కొట్టడంతో 15 నుంచి 20 మంది కిందకు పడిపోయినట్టు సమాచారం.