స్త్రీ, పురుష సమానత్వంలో ఐస్‌లాండ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్ లు ఉన్నాయి. డబ్ల్యూఈఎఫ్ వార్షిక జండర్ గ్యాప్ రిపోర్ట్- 2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్ అట్టడుగున 135వ స్థానంలో ఉంది. భారత్ తరవాత స్థానాల్లో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, కాంగో, ఇరాన్, చద్‌లు చివరి స్థానాల్లో ఉన్నాయి.