హనుమాన్ జంక్షన్ సిఐ కే సతీష్ , ఎస్ఐ సూర్య శ్రీనివాస్ వారి సిబ్బందితో కలిసి శనివారం వాహనాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో ఏ పీ 39 టి యూ 6319 లారీ ఆపితనిఖీ చేయగా అందులో అక్రమంగా రాయచూరు నుంచి కాకినాడ పోర్ట్ కి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందని, అలాగే ఏ పి 07 టి జె 1589 లారీ ఆపి తనిఖీ చేయగా 21 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు పిడుగురాళ్ల నుంచి రాయచూరు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు మొత్తం రెండు లారీలు 42 టన్నుల రేషన్ బియ్యం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ కె సతీష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా 42 టన్నుల రేషన్ బియ్యం తోపాటు రెండు వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యఫలాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.