అంగారకుడిపై నూడిల్ లాంటి వస్తువును గుర్తించినట్లు నాసా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. నాసా రోవర్ ఈ ఫొటోను చిత్రీకరించింది. దాని ముందువైపున్న కెమెరాలు ఈ పదార్థాన్ని తమ కెమెరాలో బంధించాయి. అయితే, ఈ వస్తువు ఏంటనేది శాస్త్రవేత్తలు కచ్చితంగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. గతంలో నాసా పంపిన మిషన్‌కు చెందిన శిథిల వస్తువు అయ్యుండొచ్చని భావిస్తున్నారు.